కొడాలి నాని హెల్త్ పై ఎందుకంత సీక్రెట్

మాజీ మంత్రి, వైసీపీ మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య అంటూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో జాయిన్ అయిన కొడాలి నాని ఆరోగ్యంపై AIG వైద్య బృందం ఎలాంటి హెల్త్ బులిటన్  విడుదలచెయ్యలేదు,

కొడాలి నాని గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు, ఆయన వాల్స్ మూసుకుపోయాయి, వాల్స్ వెయ్యడం కానీ లేదంటే బైపాస్ సర్జరీ కానీ చెయ్యాలని డాక్టర్స్ సూచించినట్లుగా తెలిసింది, అయితే అధికారిక అప్ డేట్ లేదు, ఈలోపే కొడాలి నాని ని ఫ్యామిలీ మెంబెర్స్ హుటాహుటిన ప్రత్యేక ఎయిర్ అంబులెన్సు లో ముంబై కి తరలించారు. 

కొడాలి నాని గుండె సంబంధిత సమస్యతో పాటుగా కిడ్నీ సమస్యతోను బాధపడుతున్నారని, అందుకే ఆయనకు మెరుగైన వైద్యం కోసం ముంబై షిఫ్ట్ చేసారు అనే వార్తలు మించి, కొడాలి హెల్త్ బులిటన్ బయటకి రాలేదు, కొడాలి AIG లో జాయిన్ అయినప్పటి నుంచి స్టిల్ ఇప్పటివరకు కొడాలి ఆరోగ్య విషయాలపై చాలా సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారు. 

కొడాలి ఆరోగ్య విషయాలు తెలియకపోవడం, మీడియాలో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమం అన్న వార్తలతో నాని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

Source link