కొత్త మెడిక‌ల్ కాలేజీల‌కు వైఎస్ఆర్ పేరు తొల‌గింపు.. ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం-removal of ysr name from new medical colleges in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

తొలిత సామాజిక పెన్ష‌న్ పేరును మార్చారు. వైఎస్ఆర్ పేరును తొల‌గించి, ఎన్‌టీఆర్ పేరును పెట్టారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోష‌ణ ప‌థ‌కం, సంపూర్ణ పోష‌ణ ప్ల‌స్ ప‌థ‌కాల పేర్ల‌ను బాల సంజీవ‌నిగా మార్చారు. దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను మ‌హిళా పోలీస్ స్టేష‌న్ల‌గా పేరు మార్చారు. విద్యా రంగంలోని ప‌థ‌కాల పేర్లను కూడా మార్చారు. జగనన్న అమ్మఒడి ప‌థ‌కాన్ని త‌ల్లికి వంద‌నం, జ‌గ‌న‌న్న విద్యా కానుకను స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ విద్యార్థి మిత్ర‌, జ‌గ‌న‌న్న గోరుముద్దను డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న బ‌డి భోజ‌నం, మ‌న‌బ‌డి నాడు-నేడును మ‌న‌బ‌డి-మ‌న భ‌విష్య‌త్తు, స్వేచ్ఛను బాలికా ర‌క్ష‌, జ‌గ‌న‌న్న ఆణిముత్యాలు పథకాన్ని.. అబ్దుల్ క‌లాం ప్ర‌తిభా పుర‌స్కారంగానూ మార్చారు.

Source link