కొత్త రేషన్ కార్డులపై అలర్ట్-రేపటి నుంచి అప్లికేషన్లు స్వీకరణ, ఇంకా ఆప్షన్ ఇవ్వలేదంటున్న ఉద్యోగులు-ap new ration cards application start from dec 2nd onwards sachivalayam employee says no option came ,తెలంగాణ న్యూస్

రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులు

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు, కొత్తగా పెళ్లైన వారిని కార్డుల నుంచి తొలగేందుకు, చిరునామా మార్పు, ఆధార్‌ నంబరు అనుసంధానం, వంటి ఏడు రకాల సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. గతంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నాటికి కార్డులు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు.. పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు సంబంధించి.. విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.

Source link