ByGanesh
Fri 31st Jan 2025 11:14 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త హీరోయిన్ ఇమాన్వి ని కూడా వదల్లేదు. అంటే ప్రభాస్ తన ఇంటి నుంచి తనతో వర్క్ చేసే నటుల కోసం క్యారియర్స్ తెప్పించినట్టే హను రాఘవపూడి ఫౌజీ మూవీలో తనతో జోడి కడుతున్న ఇమాన్వి కి కూడా తన ఇంటి ఫుడ్ తో సర్ ప్రైజ్ చేశారు. గతంలో దీపికా పదుకొనె, దిశా పటాని, శ్రద్ద కపూర్, రీసెంట్ గా మాళవిక మోహనన్, నిది అగర్వాల్ లు ప్రభాస్ ఫుడ్ గురించి షేర్ చేసుకున్నవాళ్ళే.
ఆ లిస్ట్ లోకి ఇప్పుడు ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి చేరింది. తాజాగా ఫౌజీ షూటింగ్ సెట్స్ కి ప్రభాస్ ఇమాన్వి కోసం రకరకాల వంటలతో కూడిన క్యారియర్ తెప్పించినట్లుగా ఆ ఫుడ్ చూసి తాను షాకైనట్లుగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు ప్రభాస్ అంత మంచి ఫుడ్ పంపినందుకు థాంక్స్ కూడా చెప్పింది.
గతంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ప్రభాస్ పంపించిన ఫుడ్ ఓ రూమ్ కి సరిపోయింది. నా కొడుకు, భార్య వచ్చినప్పుడు ఫుడ్ పంపించారు. అంటూ ప్రభాస్ ఫుడ్ గురించి సలార్ ప్రమోషన్ లో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇమాన్వి మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఫుడ్ విషయాన్ని షేర్ చేసింది.
Imanvi shares a glimpse of Prabhas delicious food treat:
Fauji actress Imanvi thanks Prabhas for delicious feast