Road accident in Konaseema District: టాటా మ్యాజిక్ వ్యాహనం.. ఓ కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. అలమూరు మండలం అలిక్కి దగ్గర జాతీయ రహదారి వద్ద… టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. టాటా మ్యాజిక్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా , కారులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. దైవరద్శనానకి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.