తాజా అంచనాల ప్రకారం… డ్రోన్ సేవల రంగం వార్షిక అమ్మకాల టర్నోవర్ వచ్చే మూడేళ్లలో రూ.30,000 కోట్లకు పైగా పెరగవచ్చు అని అన్నారు యశ్వంత్. పర్యవసానంగా, దేశంలో ఐదు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. “దేశంలో డ్రోన్ మార్కెట్‌లో వ్యవసాయ రంగం కీలకమైనది. పంటల పరిరక్షణ, పర్యవేక్షణ, అధిక ఫలసాయానికి డ్రోన్‌ల వినియోగం పెరుగుతోంది. “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పంటల బీమా పథకం) వంటి కార్యక్రమాలు డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. డ్రోగో డ్రోన్స్ అత్యాధునిక తయారీ యూనిట్, అధునాతన సాంకేతికత, నైపుణ్యంతో నెలకొల్పారు నెలకు 200 డ్రోన్‌లను ఇది తయారు చేస్తుంది. డ్రోన్ పరిశ్రమలో అగ్రశ్రేణి డ్రోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి డ్రోగో సంస్థ సిద్ధంగా ఉంది. డ్రోగో సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 26 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది” అన్నారు.