ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్య-two commit suicide by hanging in khammam district ,తెలంగాణ న్యూస్

ఇటీవల సాకేత్ స్మార్ట్‌ఫోన్‌ కావాలని తల్లిదండ్రులను అడిగాడు. వారు ఇప్పుడు కొనలేమని చెప్పి వారించారు. అయితే.. కొత్త సంవత్సరం వస్తోందని, తన స్నేహితులంతా ఖరీదైన ఫోన్లు వాడుతున్నారని, తనకు అలాంటిదే కావాలంటూ తల్లిదండ్రులతో సాకేత్‌ వాగ్వాదానికి దిగాడు. ఏదోలా సముదాయించిన తండ్రి పనికి వెళ్లాడు. తల్లి ఇంట్లోలేని సమయంలో సాకేత్‌ ఉరేసుకున్నాడు. తల్లి వచ్చి చూసేసరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Source link