గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ లాక్డ్

పాపం దిల్ రాజు.. ఆయన ఏ ఈవెంట్‌కి వెళుతున్నా మీడియా ముందుగా రామ్ చరణ్‌తో నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్‌డేట్ అడుగుతూ ఇబ్బంది పెట్టేస్తుంది. ఆయన గేమ్ ఛేంజర్ ఒక్కటే నిర్మించడం లేదు కదా.. బోలెడన్ని సినిమాలకి నిర్మాత. అందుకే దిల్ రాజు నిర్మించే సినిమాల ప్రెస్‌మీట్స్‌కి వెళ్ళినప్పుడల్లా మీడియా ఆయన్ని పదే పదే గేమ్ ఛేంజర్ అప్‌డేట్‌తో విసిగిస్తోంది. 

మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజు మామ గేమ్ ఛేంజర్ విడుదలెప్పుడు అని తగులుకుంటే.. మీడియా వారు దిల్ రాజుని ఫేస్ టు ఫేస్ తగులుకుంటున్నారు. రీసెంట్‌గా రామ్ చరణ్ బర్త్‌డే ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు మరో ఐదు నెలలు ఓపిక పట్టండి గేమ్ ఛేంజర్ వచ్చేస్తుంది, శంకర్ అనే శాటిలైట్ పర్మిషన్ దొరకాలి కదా అంటూ ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడిన దిల్ రాజు.. ఈరోజు తన సోదరుడు కొడుకు ఆశిష్ నటించిన లవ్ మీ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో మరోసారి మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చారు. 

గేమ్ ఛేంజర్ ఎన్ని భాషలలో విడుదలవుతుందని అడగగా.. ఐదు భాషల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనగానే.. శంకర్ గారు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‌ని ఆల్మోస్ట్ లాక్ చేశారు. త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ చెప్పడంతో మీడియా, మెగా ఫ్యాన్స్ కూల్ అయ్యారు. దిల్ రాజు చెప్పినదానిని బట్టి చూస్తే అక్టోబర్‌లో గేమ్ ఛేంజర్ ఉండొచ్చని ఇప్పటికే సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బజ్ ఉంది. మరి ఆ తేదీ ఎప్పుడనేది తెలియాలంటే మేకర్స్ ప్రకటించేవరకు ఆగాల్సిందే.

Source link