టూర్ షెడ్యూల్ ఇలా ?(Papikondalu Tour Schedule)
ఉదయం 7:30 గంటలకు రోడ్డు మార్గంలో పట్టిసీమ(Pattiseema) రేవు, పోలవరం(Polavaram) రేవు, పురుషోత్తపట్నం(Purushothapatnam) రేవులోని బోట్ల వద్దకు పర్యాటకులను తీసుకెళ్తారు. ఉదయం 9.00 గంటలకు బోట్(Boat)లో అల్పాహారం, ఆపై గోదావరి నదిలో ప్రయాణం మొదలవుతుంది. 10.30 గంటలకు గండిపోచమ్మ ఆలయానికి(Gandipochamma Temple) చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రయాణ మార్గంలో మధ్యాహ్నం 1.00 గంటకు పడవలో శాఖాహార భోజనం అందిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటలకు పాపికొండల వద్దకు(Papikondalu Boat Tour) బోటులో చేరుకుంటారు. పాపి కొండల మధ్య ప్రయాణం ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. మధ్యాహ్నం 3.00 గంటలకు ఖమ్మం జిల్లా పేరంటపల్లి గ్రామానికి బోటు చేరుకుంటుంది. అక్కడ రామకృష్ణ ముని ఆశ్రమం, వీరేశ్వర స్వామి దేవాలయం, శివుడ్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్నం రేవుకు పడవలో తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 7.30 గంటలకు రోడ్డు మార్గంలో రాజమండ్రికి తీసుకొస్తారు. రాత్రి 8.30 గంటలకు పర్యాటకులు రాజమండ్రి చేరుకుంటారు. ఏపీ టూరిజం బోట్లలో టూర్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8.00 వరకు ఉంటుంది.