10మంది పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులను సస్పెండ్ చేయడంపై సచివాలయ ఉద్యోగుల్లో కలవరం రేగుతోంది. రాష్ట్రంలో మొదటి విడతలో ఎంపిక చేసిన 42 పుర, నగరపాలక సంస్థల్లో 2021 అక్టోబరు 2 నుంచి ఇళ్లు, దుకాణాల నుంచి చెత్త సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి వినియోగ రుసుములను ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంటికి రూ.30 నుంచి గరిష్టంగా రూ.120వరకు వసూలు చేస్తున్నారు. పన్ను వసూలు చేసే బాధ్యతను కార్యదర్శుల నెత్తిన పెట్టారు. వీటి వసూళ్లు ప్రతినెలా 50-60 శాతానికి మించడం లేదు. లక్ష్యాలను చేరుకోని వారికి కొద్ది రోజుల క్రితం వరకు మెమోలిచ్చారు. తాజాగా అధికారులు సస్పెన్షన్లకు దిగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.