పవన్ పై పేర్నినాని సెటైర్లు
అయితే పేర్ని వ్యాఖ్యలపై పిఠాపురం సభలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ… అన్నవరం సత్యదేవుడి గుడికి వెళ్తే ఎవరో తన చెప్పులు కొట్టేశారన్నారు. ఎవరికైనా కనిపిస్తే చెప్పండని వ్యంగ్యంగా మాట్లాడారు. వైసీపీ పాలనలో చెప్పులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. శనివారం పేర్నినాని జర్నలిస్టులను చూడగానే మిట్ట మధ్యాహ్నం వచ్చారు భోజనం చేశారా అంటూ, పవన్ చెప్పులు పోయాయన్న విషయంపై స్పందించారు. 13వ తేదీన చెప్పులు పోతే, మూడు రోజుల తరువాత 16వ తేదీన పిఠాపురం సభలో గుర్తుకొచ్చిందా అని పవన్ పై సెటైర్లు వేశారు. చెప్పులు పోతే పవన్ కల్యాణ్ మూడు రోజుల తర్వాత కంగారు పడుతున్నారన్నారు. గత ఏడాది అక్టోబర్ 18, 19న రాత్రి తన చెప్పులు పోయాయన్న పేర్నినాని… లింగమనేనికి చెందిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఒక చెప్పు పోయిందన్నారు. ఓ చెప్పు పోయి 9 నెలలు అయిందని, తీసుకెళ్లినోడు ఒక్క చెప్పు ఏం చేసుకుంటాడో తెలియని సెటైర్లు వేశారు. నా చెప్పు పోయిందని ఎవరిని అనుమానిస్తాం, ఎదురుగా ఉన్న పవన్ కల్యాణ్ ఆఫీస్ ఉంటే ఆయనను అనుమానిస్తామా? అని ప్రశ్నించారు. పోయిన చెప్పులను ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తారు కానీ, ముందు జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాస్ పోయింది అది చూసుకో అని పవన్ కల్యాణ్ కు సూచించారు.