చైతు-శోభిత వివాహం హాజరైన అతిథులు

కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియో లో నాగ చైతన్య-శోభితల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగిపోయింది. 8.13 నిమిషాల పెళ్లి ముహూర్తం నిశ్చయించగా అదే సమయానికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖుల నడుమ శోభిత మెడలో తాళి కట్టి ఏడడుగులు నడిచాడు నాగ చైతన్య. 

హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి లో నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, సుహాసిని, కీరవాణి తదితరులు  హాజరయ్యారు. 

ఇరుకుటుంబ సభ్యుల బంధుమిత్రులు సమక్షంలో నాగ చైతన్య-శోభితల వివాహ జరిగిపోయింది. 

Source link