జగన్ చుట్టూ కోటరీ, విరిగిన మసస్సు మళ్లీ అతుక్కోదు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు-coterie around jagan political turmoil with ex mp vijayasai reddy comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Ex MP Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళగిరి సీఐడీ పోలీసులు ముందు విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌ అధిపతి కేవీ రావు నుంచి బలవంతంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. వాటాలు బలవంతంగా లాక్కున్నారా? ఇందులో ఎవరి పాత్ర ఉంది? వంటి విషయాలపై విజయసాయిరెడ్డిని సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 11 నుంచి దాదాపు 3:30 గంటలపాటు విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. కేవీ రావు ఫిర్యాదుతో విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్, అరబిందో రియాల్టీ ఇన్ ఫ్రాపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Source link