అనుమానం పెనుభూతం
అనుమానం(Suspicion) పెనుభూతంగా మారి మౌనికను మామ నరికి చంపడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రాజిరెడ్డికి అనుకూలంగా స్థానికులు చెబుతుండగా, మౌనిక పుట్టింటివారు మాత్రం మామే అఘాయిత్యానికి యత్నించాడని ఆరోపిస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు నిమగ్నం కాగా, తల్లి మృతి, తండ్రి దుబాయి(Dubai)లో ఉండడంతో వారి పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అన్యాయం అయ్యారు. విగతజీవిగా మారిన తల్లికి ఏమయ్యిందో తెలియని పిల్లలు బిక్కుబిక్కుమంటూ వచ్చిపోయేవారిని చూస్తూ అమ్మకు ఏమయ్యిందని అడుగుతుండడం స్థానికులను కలిచివేసింది. క్షణికావేశం పిల్లలకు తల్లి లేని పరిస్థితి తీసుకొచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య హత్యకు గురికావడంతో దుబాయ్ లో ఉన్న భర్త స్వస్థలానికి బయలుదేరారు.