నయా మోసంపై ఆరా తీస్తున్నారు. బాధితులు 1200 మంది వరకు ఉంటారని తెలుపడంతో బాధితులనుంచి ఫిర్యాదుని స్వీకరించి ఆన్లైన్ పెట్టుబడి మోసం పై విచారణ చేపట్టారు. లాభాలను ఆశించి ఆన్ లైన్ లో పెట్టుబడి పెట్టడం తప్పేనని తాము ఇచ్చిన అసలు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇక ముందు ఇలాంటి మోసాలు జరగకుండా రాకేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.