మిర్చి యార్డు చరిత్ర కూడా తెలియకుండా జగన్ మాట్లాడారని, ఏపితో పాటు వివిధ రాష్ట్రాల్లో మిర్చి పండుతోందని, ఏపీలోని 11 జిల్లాల్లో సాగు చేస్తున్నారని, 2015 నుంచి పోలిస్తే 2023-24లో మాత్రమే రూ20,500 క్వింటాలు కు ఉందన్నారు. రైతులు, కూలీల ఇబ్బందులు ప్రభుత్వం ఎప్పుడో గుర్తించిందని, 2020 లో జగన్ ప్రభుత్వమే మిర్చి కి రూ.7 వేలు మద్దతు ధర ప్రకటించారని, కానీ అప్పటికి గుంటూరు మిర్చి యార్డు లో మిర్చి ధర రూ.12,500 గా ఉందన్నారు.