జబర్దస్త్ కమెడియన్స్ మొత్తం పవన్ వెనకే

జబర్దస్త్ లోనాగబాబు ని అభిమానించే వాళ్లంతా ఎక్కువగా మెగా ఫ్యామిలి తో అనుబంధాన్ని మైంటైన్ చేసేవారే. టాలీవుడ్ కమెడియన్ అలీ, పోసాని లాంటి వాళ్లకు వైసీపీ కి అనుకూలంగా పదవులని అనుభవిస్తూ భజన చేస్తుంటే.. జబర్దస్త్ కమెడియన్స్ మాత్రం ఎలాంటి పదవులు ఆశించకుండా పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హైపర్ అది గ్రౌండ్ లోకి దిగిపోయి జనసేన తరపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ లు కూడా ప్రోపర్ గా షూటింగ్స్ కి బ్రేకిచ్చి జనసేన తరఫుఫున ప్రచారానికి దిగారు. పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటూ వారు ప్రచారం చేస్తున్నారు. మెడలో జనసేన జెండాలతో మహా బిజీగా కనబడుతున్నారు. పవన్ ని గెలిపించేవరకు నిద్రపోమని చెబుతున్నారు. 

ఆది అయితే ఇంటింటికి తిరిగి జనసేనకు ఓటెయ్యమంటున్నాడు. అనకాపల్లిలో కొణతాలని జనసేన నుంచి గెలిపించాలని ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులు ఇంటింటికి వెళ్లి, వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.  

మరోపక్క జబర్దస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ ఎప్పటినుంచో నాగబాబు, పవన్ కళ్యాణ్ కి జై కొడుతూ వైసీపీ నేతలని, ముఖ్యంగా విజయ సాయి రెడ్డిని ఇంటర్వ్యూలో చీల్చి చెండాడుతున్నాడు. బుల్లితెర కమెడియన్స్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ వెనుకే కనబడుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమంటూ వారు ఎన్నికల బరిలో పోరాటం మొదలు పెట్టారు. మరి కమెడియన్స్ ప్రచారం పవన్ కి ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి.

Source link