జయకేతనంలో పవన్ స్పీచ్ హైలెట్స్

జనసేన జయకేతనంలో పవన్ స్పీచ్ హైలెట్స్

రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా.. అనే మాటలు నిజం చేశాం

ప్రయాణంలో ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదు

అన్నీ ఒక్కడినై పోరాటం చేశా

ఓడినా అడుగు ముందుకే వేశాం

మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం.మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు..

నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం మన కార్యకర్తలను, వీరమహిళలను అనేక బాధలు పెట్టారు

నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు అసెంబ్లీ గేటును తాకనివ్వం అని ఛాలెంజ్ చేశారు..

వాళ్ల ఛాలెంజ్‌లు సవాలుగా తీసుకుని పోరాడాం దేశమంతా మనవైపు చూసేలా వందశాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించాం

దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యా రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తా..అనే మాటలు నిజం చేశాం.

దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్‌ పవన్‌

నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..

కరెంట్‌షాక్‌ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు..

మా జనసేన వీరమహిళలు.. రాణిరుద్రమలు. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ బీమ్‌లు..మా వీరమహిళలు..

తమిళనాడులోనూ రాజకీయపరంగా మనకు అభిమానులున్నారు

మహారాష్ట్ర, కర్ణాటకలోనూ మన పార్టీకి అభిమానులున్నారు

తమిళులు నా తెలుగు ప్రసంగాలు వింటున్నారని తెలిసింది

తమిళులు నాపై చూపుతున్న ప్రేమకు కృతజ్ఞుడిని హిందీ, తమిళం, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో ప్రసంగించిన పవన్‌

గజ్జెకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్‌ అన్నకు నివాళులు 

ఖుషి సినిమా చూసి గద్దర్‌ నన్ను ప్రోత్సహించారు.. అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లుగా పార్టీని నడిపాం

నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే.

సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు.

వేదికపై ప్రొఫెసర్‌ శ్రీపతి రాముడును సత్కరించిన పవన్ కల్యాణ్‌

మనదేశానికి బహుభాషలే మంచిది.తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలి.

మన పార్టీకి 11వ సంవత్సరం.. వాళ్లను 11 సీట్లకు పరిమితం చేసాం..

పోలీసులకు స్వయం నిర్ణయాధికారం ఉండదు.. విధుల నిర్వహణే ఉంటుంది.

సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే నా కోరిక..

నేను డిగ్రీ చేసి ఎస్‌ఐను కావాలని మా నాన్న అనేవారు.

చంటి సినిమాలో మీనాను పెంచినట్లు మా ఇంట్లో నన్ను పెంచారు..

బయటకు వెళ్తే ఏమవుతానో అని మా ఇంట్లో నిత్యం భయపడేవారు..

సినిమాల్లోకి, రాజకీయాల్లోకి వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు..

మా నాన్న చిన్నప్పుడు ఎంతో క్రమశిక్షణతో పెంచారు

కోట్లమందికి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చింది ఆ భగవంతుడే..

Source link