జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. డబ్బా పాలు వికటించి కవల పిల్లలు మృతి!-twins die after consuming bottled milk in jayashankar bhupalpally district ,తెలంగాణ న్యూస్

ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా..

పిల్లలకు హార్ట్ బీట్ సరిగా లేదని, వెంటనే భూపాలపల్లిలోని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సలహా ఇచ్చాడు. దీంతో లాస్య, ఇతర కుటుంబ సభ్యులు ఇద్దరు పిల్లలను తీసుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పిల్లలిద్దరూ అపస్మారక స్థితికి చేరుకోగా.. అక్కడ పరీక్షించిన డాక్టర్లు ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. నాలుగు నెలల కవల పిల్లలు ఇద్దరూ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు కానరాని లోకాలకు చేరడంతో లాస్య, వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.

Source link