జాట్ గెట్టింగ్ గ్రేట్ రెస్పాన్స్

బాలీవుడ్ బాలకృష్ణ(ఇక్కడ మన బాలయ్య కి ఎంత కల్ట్ మాస్ ఫాలోయింగ్ ఉందో అక్కడ సన్నీ డియోల్ కి అంతే ఇమేజ్ ఉంది. అందుకే ఆ పోలిక). సినిమా జాట్ నేడు విడుదలై వీక్షకుల, విమర్శకుల ప్రశంశలు అందుకొంటుంది. ఈ బాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రానికి దర్శకుడు మనవాడే కావడం అసలైన విశేషం.

రవితేజ తో క్రాక్ సినిమా చేసి నటసింహం బాలకృష్ణ తో వీర సింహ రెడ్డి తీసి బాలీవుడ్ స్థాయికి బాటలు వేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని జాట్ అనే సినిమాతో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా నార్త్ లో కూడా విజయకేతనం ఎగుర వేసి తెలుగు దర్శకుల జాబితాలో చేరారు అనేది ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోన్న రిపోర్ట్. 

ఓ తెలుగు దర్శకుడు, ఓ తెలుగు బ్యానర్ హిందీ యాక్షన్ హీరోతో చేస్తోన్న సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే ప్రీమియర్స్ నుంచే సన్నీ డియోల్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అయ్యే సినిమాగా, మాస్ ఆడియన్స్ కి పక్కా పైసా వసూల్ అనిపించే సినిమాగా టాక్ తెచ్చుకుంది జాట్. 

ఈరోజు విడుదలైన సినిమాల్లో తమిళనాట తల అజిత్ తనకు సరిపడే హీరో ఎలివేషన్స్ తో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ తో అభిమానులని ఆనందపరిచినా, ఆ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా లేదనే విమర్శ వినిపిస్తోంది. తెలుగులో సిద్దు జిన్నలగడ్డ-బొమ్మరిల్లు భాస్కర్ కలిసి చేసిన జాక్ కూడా మిశ్రమ స్పందనకే పరిమితమైంది. హిందీలో విడుదలైన జాట్ మాత్రం అటు థియేటర్స్ లో రెవిన్యూని, ఇటు సోషల్ మీడియాలో గొప్ప రెస్పాన్స్ ని రాబట్టుకుంటూ దుసుకుపోతుంది. 

రివ్యూస్, రిపోర్ట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్న నేపథ్యంలో గదర్ 2 చిత్రంతోనే 500 కోట్ల మార్క్ దాటేసిన నార్త్ కా మాస్ మసాలా హీరో సన్నీ డియోల్ ఇప్పుడు ఈ జాట్ తో ఏ రేంజ్ రెవిన్యూ చూపిస్తాడో, ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో వేచి చూద్దాం. 

Source link