జిల్లాల వారీగా నివేదికలు…! నామినేటెడ్‌ పదవులపై కీలక ప్రకటన-cm revanth reddy key announcement on nominated posts in the tpcc state executive meeting ,తెలంగాణ న్యూస్

“పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. సుదీర్ఘకాలంగా పని చేసినవారికి కొంతమందికి అవకాశాలు రాలేదు. వారినికాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తాం. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది. మార్చి 10 లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

Source link