రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందించాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా మిగతా 118 నియోజకవర్గాలు కలిపి మొత్తం 1,29,800 యూనిట్లను అందించనున్నారు. అర్హత కలిగిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అంటే… నేరుగా ఎంపిక చేస్తారా…? దరఖాస్తులను స్వీకరించి… పరిశీలించిన తర్వాత ప్రకటిస్తారా అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దళితబంధు పోర్టల్ ద్వారా ఎంపిక, పరిశీలన, యూనిట్ల మంజూరు ఉంటుందని పేర్కొన్నప్పటికీ…. అధికారికంగా మార్గదర్శకాలు వెలువడని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారన్న వార్తలు రావటం… స్వయంగా కేసీఆర్ హెచ్చరించటం వంటివి కూడా జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో… రెండో విడత దళితబంధు లబ్దిదారుల ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుందనే దానిపై మాత్రం స్పష్టత కరువైందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించినున్నట్లు మంత్రి చెప్పిన నేపథ్యంలో… దరఖాస్తుల విషయంలో స్పషత రావాలి.