జులై 20న సింహాచ‌లంలో గిరి ప్రద‌క్షిణ‌, 32 కిలో మీట‌ర్ల మేర జరిగే ఉత్సవం-simhachalam giri pradakshina on july 20th temple board making necessary actions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

గిరి ప్రద‌క్షిణ మార్గం

గిరి ప్రద‌క్షిణ రోజున పుష్ప ర‌థం యాత్ర వెనుక ల‌క్షలాది మంది ప్రజ‌లు న‌డుస్తారు. 32 కిలో మీట‌ర్ల మేర జ‌రిగే ఈ ప్రద‌క్షిణ విశాఖ‌ప‌ట్నం ప్రధాన ప్రాంతాల్లో సాగుతోంది. ఈ గిరి ప్రద‌క్షిణ‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు త‌మిళనాడు, క‌ర్ణాట‌క‌, ఒడిశా త‌దిత‌ర రాష్ట్రాల నుంచి భ‌క్తులు వ‌చ్చి పాల్గొంటారు. గిరి ప్రద‌క్షిణ సింహాచ‌లం కొండ పాదాల వ‌ద్ద ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి జైలు రోడ్డు మీదుగా అడ‌వివ‌రం, ఆరిలోవ‌, హ‌నుమంత‌వాక‌, జోడుగుళ్ల పాలెం బీచ్, మాధ‌వ‌ధార‌, ఎన్‌ఏడీ జంక్షన్, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం ఆలయానికి చేరుకుంటుంది. అయితే పుష్ప ర‌థం యాత్ర రూట్ కూడా దాదాపుగా అదే ఉంటుంది. అయితే కాలిన‌డ‌క గిరి ప్రద‌క్షిణ మార్గానికి, ర‌థం మార్గానికి చిన్న తేడా ఉంటుంది. బీచ్ రోడ్డు వైపు ర‌థం వెళ్లదు. అయితే సింహాచ‌లం కొండ పాదాల నుంచి జైలు రోడ్డు మీదుగా అడ‌వివ‌రం, ఆరిలోవ‌, హ‌నుమంత‌వాక నుంచి జాతీయ ర‌హ‌దారి (ఎన్‌హెచ్) 5 మీదుగా ఎన్‌డీఏ జంక్షన్, గోపాలపట్నం నుంచి తిరిగి సింహాచలం చేరుకుంటుంది. ర‌థం వెంట ఉండే మొద‌టి బ్యాచ్ మాత్రం, ర‌థం వెళ్లే మార్గం వైపే వెళ్తుంది. అయితే ఆ త‌రువాత మార్గనిర్దేశం చేసేవారు ఎవ‌రు ఉండ‌క‌పోవ‌డంతో జ‌నాలు ర‌ద్దీ భారీగా పెర‌గ‌డంతో అప్పుడు రూటు మారిపోయి, బీచ్ రోడ్డు వైపు వెళ్తుంది.

Source link