జేఎన్వీ 6, 9వ తరగతులు ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి-amaravati jnvst class 6th 9th result 2024 declared direct link full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

JNVST 6, 9th Class Results 2024 : నవోదయ విద్యాలయ(JNVST) 6, 9వ తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాలు(JNV Results) విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు గత ఏడాది నవంబర్ 4న పరీక్షలు నిర్వహించారు. ఏపీలో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రతీ ఏటా 6, 9వ తరగతుల ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు.

Source link