Revanth Reddy- Jupally : బుధవారం ఉదయం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. జూపల్లి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి బృందం…లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. జూపల్లిని కాంగ్రెస్ లో చేరాలని కోరారు. అనంతరం జూపల్లి కృష్ణారావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం జూపల్లి, గుర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి గతంలో బీఆరెస్ లో చేరారని గుర్తుచేశారు. తొమ్మిదేళ్లు గడిచినా సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అందుకే వారంతా కేసీఆర్ పై తిరుగుబావుటా ఎగరేశారని తెలిపారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి వచ్చామన్నారు.