Tollywood Vs State Govt : దక్షిణ భారతదేశంలో సినీ పరిశ్రమకు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన వారు ఎందరో ఉన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయ లలిత సీఎంలు అయితే…చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రోజా, ఉదయనిధి స్టాలిన్….ఇలా ఎంతో మంది కీలక పదవులు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు కొని ఇప్పటి తెలుగు రాష్ట్రాల వరకూ సినీపరిశ్రమ, రాజకీయ నేతల మధ్య పెద్ద యుద్ధాలే జరిగాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో ఆయనకు రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే సినీ పరిశ్రమ సైతం రాజకీయ పార్టీలకనుగుణంగా మద్దతు పలుకుతున్నాయని తెలుస్తోంది.