టీఎస్ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్ కు ‘గమ్యం’ యాప్, మహిళా భద్రతకు ప్రత్యేక ఫీచర్-tsrtc bus tracking app gamyam launched md sajjanar in hyderabad ,తెలంగాణ న్యూస్

మహిళా భద్రతకు ‘ప్లాగ్ ఏ బస్’ ఫీచర్

మహిళా ప్రయాణికుల భద్రతకు టీఎస్ఆర్టీసీ పెద్దపీట వేస్తుందని సజ్జనార్ తెలిపారు. మహిళల సౌకర్యార్థం గమ్యం యాప్ లో ‘ప్లాగ్ ఏ బస్’ అనే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ప్లాగ్ ఏ బస్ ఫీచర్ బస్ అందుబాటులో ఉంటుంది. యాప్ లో వివరాలు నమోదు చేయగానే తమ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షం అవుతుంది. ఆ లైట్ ను డ్రైవర్ వైపునకు చూపించగానే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దీంతో మహిళలు క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్(SoS) బటన్ ద్వారా టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ను సంప్రదించే సదుపాయం ఉందన్నారు. డయల్ 100, 108కి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేశామని సజ్జనార్ చెప్పారు. ఈ యాప్ నుంచే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చన్నారు. బస్సు బ్రేక్ డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం, తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్ట్ చేయొచ్చన్నారు. ‘TSRTC Gamyam’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని, టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎండీ సజ్జనారా తెలిపారు.

Source link