టీజీఎస్‌ ఆర్టీసీకి డ్రైవర్లు కావలెను.. నియామకానికి అధికారుల వినూత్న ఆలోచన!-officials decision to fill driver posts in telangana rtc ,తెలంగాణ న్యూస్

డ్రైవర్లపై ఒత్తిడి..

తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంస్థలో చాలావరకు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. దీనికి తోడు సంస్థలో భారీగా ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయడం లేదు. రద్దీని తగ్గించడానికి బస్సుల్ని అదనపు కిలోమీటర్లు తిప్పుతున్నారు. దీంతో డ్రైవర్లు చాలామంది ఒక డ్యూటీ అయిపోగానే కాస్త విరామం తర్వాత రెండో డ్యూటీ చేస్తున్నారు. ఇలా ఒక రోజులో దాదాపు 14 గంటలు విధుల్లో ఉంటున్నామని కొందరు డ్రైవర్లు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా అలిసిపోతున్నామని.. ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నారు,

Source link