అక్రమాస్తులు రూ.4.75 కోట్లు
అయితే మర్రిగూడ ఎమ్మార్వో మహేందర్‌రెడ్డి అక్రమాస్తులు రూ.4.75 కోట్లుగా ఏసీబీ అధికారులు తేల్చారు. శనివారం ఉదయం నుంచి వనస్థలిపురం హస్తినాపురం శిరిడీ సాయి నగర్‌లో ఉన్న మహేందర్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి, రూ.2.07 కోట్ల నగదుతో పాటు కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్థిర, చరాస్తులను గుర్తించారు. ఇంట్లో ట్రంక్ పెట్టెలో దాచి ఉంచిన సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అనంతరం ఎమ్మార్వో మహేందర్ రెడ్డిని అరెస్టు చేసిన అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.