ట్రిపులార్ ఉత్తర భాగంలో వింత పరిస్థితి, అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతుల పట్టు-hyderabad rrr land acquisition farmers demands change alignment filed petition in high court ,తెలంగాణ న్యూస్

ఉత్తర భాగ నిర్వాసితుల ఆందోళన

రీజినల్ రింగ్ రోడ్డును ఉత్తర, దక్షిణ భాగాలు విభజించారు. ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లా తూప్రాన్ నుంచి మొదలై, గజ్వేలు మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. ఈ భాగం నిడివి 158 కిలోమీటర్లు. దక్షిణ భాగం చౌటుప్పల్ వద్ద మొదలై షాద్ నగర్ మీదుగా సంగారెడ్డి వద్ద ముగుస్తుంది. ఈ భాగం నిడివి 194 కిలోమీటర్లు. ప్రస్తుతం ఉత్తర భాగంలో భూ సేకరణ జరగుతుండగా, డెబ్బై శాతానికి పైగానే సేకరణ పూర్తయింది. కానీ, చౌటుప్పల్ ప్రాంత నిర్వాసితులు ట్రిపులార్ అలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర భాగంలో రోడ్ అలైన్ మెంట్ ను ఇష్టానుసారం మార్చారన్నది నిర్వాసితుల ప్రధాన అభియోగం. ఈ మేరకు కేంద్ర మంత్రలుకూ వినతి పత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ట్రిపులార్ మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉండాలన్నది నిబంధన. కానీ, మారిన అలైన్ మెంట్ వల్ల గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఈ దూరం కేవలం 28 కిలోమీటర్లుగా ఉంది.

Source link