ఢిల్లీలో బీసీ పోరు గర్జన ధర్నాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి- ఎంపీలు అసదుద్దీన్, కనిమొళి

Congress Leader BC Maha Dharna in Delhi | న్యూఢిల్లీ బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించాలని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు బీసీ పోరు గర్జన ధర్నాలో పాల్గొని బీసీలకు న్యాయం జరగడంపై పోరాటం చేయాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నేత వీ హనుమంతరావు, తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని, మహిళా రిజర్వేషన్లలో 33 శాతం బీసీ మహిళా నేతలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ జంతర్ వద్ద నిర్వహించిన బీసీ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన అనంతరం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం లభించింది. కేంద్రం దాన్ని ఆమోదించి అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని చూడండి

Source link