వ్యవస్థలపై కామెంట్స్..
మహిళ చనిపోయిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. రూల్స్ ప్రకారం అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్, ఆ వెంటనే బెయిల్ వచ్చింది. అయితే.. జైలు నుంచి వచ్చిన అల్లు అర్జున్‌ను సినిమా పరిశ్రమ వారు వరుసగా ఇంటికెళ్లి పరామర్శించారు. నాని లాంటి వాళ్లు ఓ అడుగు ముందుకేసి.. ప్రభుత్వం, పోలీస్, మీడియా వ్యవస్థలను విమర్శిస్తూ పోస్టు చేశారు. ఇదే బాటలో మరికొందరు నడిచారు. కానీ.. బాధిత కుటుంబాన్ని ఎవ్వరూ పరామర్శించలేదు. ఈ విమర్శలు పెరగడంతో.. అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్ చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. అండగా ఉంటారని హామీ ఇచ్చారు.