లడ్డూ ప్రసాదంపై వివాదం
శ్రీవారి ప్రసాదం విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెద్ద ఎత్తున రగడ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రకటన చేశారు. దీంతో ఈ అంశం రాష్ట్రంలో సంచలనం అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఏకంగా దీక్ష చేయడం, అలాగే తిరుమల వెళ్లి బహిరంగ సభ పెట్టి సనాతన ధర్మ పరిరక్షణను కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల వెళ్తానని ప్రకటించడం, అప్పుడు డిక్లరేషన్ అంశం తెరపైకి రావడం, ఆ తరువాత అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్లి ప్రమాణం చేయడం, పోలీసులు అడ్డుకోవడం ఇలా కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో ఇదే అంశం చర్చ జరిగింది. అయితే చివరికి సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో రాష్ట్రంలో చర్చకు పుల్‌స్టాప్ పడింది. ప్రస్తుతానికి సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ జరుపుతుంది.