తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెలలో విశేష ఉత్సవాలు-tirumala ttd announced may month special festival tiruchanur vasanthotsavam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Tirumala : తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. మే నెలలో తిరుమలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలను టీటీడీ (TTD)ప్రకటించింది. నిన్న(ఏప్రిల్ 28న) తిరుమల స్వామి వారిని 86,241 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,730 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.65 కోట్లు కానుకలు వచ్చాయి. స్వామి వారి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు(Tirumala Tickets) లేని సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతోంది.

మే నెలలో తిరుమలలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు(Tirumala Festivals)

  • మే 3న- భాష్యకర్ ఉత్సవం
  • మే 4న- సర్వ ఏకాదశి
  • మే 10న – అక్షయతృతీయ
  • మే 12న- భాష్యకర సత్తుమొర, రామానుజ జయంతి, శంకర జయంతి
  • మే 17 నుంచి 19 వరకు-పద్మావతి పరిణయోత్సవం
  • మే 22న-నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి
  • మే 23- అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి

మే 22 నుంచి 24వ తేదీ వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం(Tiruchanur Padmavathi Temple)లో మే 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ ఉత్సవాల్లో భాగంగా మే 23 ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం(Golden Chariot) కన్నులపండువగా నిర్వహించనున్నారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

మే 14న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంత్సోవాలను(Vasanthotsavalu) సందర్భంగా మే 14న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(Koil Alwar Tirumanjanam) నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఉత్సవాల కార‌ణంగా మే 14, మే 21 నుంచి 24వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్సవం, సహ‌స్రదీపాలంకార‌సేవ‌, మే 23న తిరుప్పావ‌డ సేవ‌, మే 24న లక్ష్మి పూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టీటీడీ(TTD) ర‌ద్దు చేసింది.

Source link