తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ.. కోటా బియ్యం కేటాయింపు-rice distribution for new ration cards in telangana from this month quota rice allocation ,తెలంగాణ న్యూస్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 63 మండలాలు, 14 పురపాలికలు, రెండు నగర పాలక సంస్థలు గ్రామ, వార్డు సభలు నిర్వహించి జాబితాలో ఉన్నవారి పేర్లను చదివి వినిపించారు. ఆ తర్వాత గతనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంక్షేమ పథకాలను ప్రారంభించే లక్ష్యంతో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులుగా గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని 1,608 మందికి రేషన్ కార్డులు అందజేశారు. కొత్త కార్డుల్లో 9,663 యూనిట్లు (లబ్ధిదారులు) నమోదవగా ఈ నెల నుంచి వారికి బియ్యం పంపిణీ చేయనున్నారు.

Source link