గృహలక్ష్మీ పథకానికి అర్హులను ఎంపిక చేసే క్రమంలో లబ్దిదారులు గతంలో ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధి పొందని వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. లబ్దిదారుల్లో నియోజక వర్గం యూనిట్‌గా పరిగణిస్తారు. మొత్తంలో మంజూరైన ఇళ్ళలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని సర్కారు స్పష్టం చేసింది. మిగిలిన 20 శాతాన్ని ఆర్థికంగా వెనుక బడిన వారికి ఇస్తారు. విధానాలను ఖరారు చేయడంలో మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ఉన్నతాధికారులను భాగస్వాములను చేస్తారు.నెలాఖరులోగా అర్హత ప్రమాణాలను ఖరారు చేస్తారు. జులై నెలాఖరులోగా సంబంధిత మంత్రి స్థాయిలో విధానాలపై చర్చించి ముసాయిదాను సీఎం కేసీఆర్‌కు అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి.