తెలంగాణలో 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, కేసీఆర్ అప్పు రూ.8 కోట్లు-telangana adr report on mlas assets 106 members billionaire cm kcr has 8 crore debt ,తెలంగాణ న్యూస్

TS Mlas Assets : తెలంగాణలోని 119 ఎమ్మెల్యేలలో 90 శాతం అంటే 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ADR) సంస్థ వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో అయిదు మంది, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు అలాగే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తులను ఏడీఆర్ సంస్థ ప్రకటించింది. కాగా ఈ రిపోర్ట్ ఆధారంగా తెలంగాణ సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.13.57 కోట్లుగా ఉంది. ఇక పార్టీల పరంగా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి అత్యధికంగా రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా సంస్థ పేర్కొంది.

Source link