రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. చంద్రుగొండ రేంజ్ ఎఫ్‌ఆర్వో చలమల శ్రీనివాసరావు తన బృందంతో కలిసి 2022, నవంబరు 22న మండలంలోని ఎర్రబోడు అటవీ శాఖ ప్లాంటేషన్ తనిఖీకి వెళ్లారు. ఫారెస్ట్ ప్లాంటేషన్ కేంద్రంలోని మొక్కల వద్ద పశువులను మేపుతున్న స్థానిక గొత్తికోయలు మడకం తులా, పొడియం నంగాలను ఇదేంటని ప్రశ్నించి అడ్డుకున్నారు. దీంతో వారు ఎఫ్‌ఆర్వోతో పాటు ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఎఫ్‌ఎస్‌వో తేజావత్ రామారావు, వాచర్ భూక్యా రాములుతో గొడవపడి కర్రలతో దాడి చేశారు.