మే 28న హాల్ టికెట్లు
తెలంగాణలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ యూనివర్సిటీ టీఎస్ ఐసెట్–2024(TS ICET 2024) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 7వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించారు. జూన్ 4, 5 తేదీల్లో మొత్తంగా మూడు సెషన్లలో ఐసెట్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 7 వరకు ఎలాంటి ఆలస్య రుసుము(Later Fee) లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550 కాగా, ఇతరులకు రూ.750గా నిర్ణయించారు. అప్లికేషన్లలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మే 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సరి చేసుకునే అవకాశం కల్పిస్తారు. మే 28న కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.