సర్వం సిద్ధం..
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. ఎల్లుండి (9వ తేదీన) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉంది.