TS Schools Timings : తెలంగాణ సర్కార్ పాఠశాలల పనివేళ్లల్లో కీలక మార్పులు చేసింది. హైదరాబాద్ పరిధిలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్కూళ్లను ఉదయం 9.30 నుంచి ప్రారంభిచాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పనిచేయనున్నాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేయనున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు నడుస్తున్నాయి. ఈ సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. పనివేళల్లో మార్పుల ఉత్తర్వులను అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ పంపించింది. ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు పనివేళల్లో మార్పులపై సూచనలు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.