తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదల, 24 మంది ఎంపిక-telangana food safety officer final results released 24 candidates provisionally selected ,తెలంగాణ న్యూస్

తెలంగాణలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ నియామక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు 24 మందిని ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ (హెల్త్) లాబొరేటరీస్ & ఫుడ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 24 పోస్టుల భర్తీ కోసం జులై 21, 2022న నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు నవంబర్ 11, 2022న రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈ నెల 7, 8 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇతర ధృవీకరణలు పూర్తయిన తర్వాత, టీజీపీఎస్సీ ఇవాళ 24 మంది అభ్యర్థులతో కూడిన తాత్కాలిక ఎంపిక జాబితాను ప్రకటించింది. అభ్యర్థులు ఫలితాల కోసం కమిషన్‌ వెబ్ సైట్ ను https://www.tspsc.gov.in ను సందర్శించవచ్చు.

Source link