Team India: వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‍లను గెలిచిన టీమిండియా టీ20 సిరీస్‍ను నిరాశాజనకంగా మొదలుపెట్టింది. తొలి టీ20లో విండీస్ చేతిలో 4 పరుగుల స్పల్ప తేడాతో ఓడిపోయింది. అయితే, తెలుగు ప్లేయర్ నంబూరి తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాలో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‍లోనే ఆకట్టుకున్నాడు. ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవుతుండగా.. మరో ఎండ్‍లో ఎదురుదాడి చేశాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాది 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. టీమిండియా పరాజయం పాలైనా.. తన తొలి మ్యాచ్‍లోనే అతడు అద్భుతంగా పోరాడిన తీరుపై ప్రశంసలు వస్తున్నాయి. టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా తిలక్ వర్మను పొగిడాడు. వివరాలివే..