తెలుగు రాష్ట్రాలకు ఇంటర్‌ మినిస్టీరియల్‌ టీమ్‌..! వరద నష్టంపై అంచనా వేయనున్న కేంద్ర బృందాలు-an inter ministerial central team will soon inspect the flood affected areas of ap telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డీఆర్ఎఫ్‌) నుండి అదనపు ఆర్థిక సహాయం కోసం కేంద్ర బృందం హోం మంత్రిత్వ శాఖకు తన సిఫార్సులను చేస్తుంద‌ని తెలిపారు. ఐఏఎఫ్‌, నేవీ హెలికాప్టర్లు 65 సోర్టీలను నిర్వహించాయ‌ని, ఆంధ్రప్రదేశ్‌లోని బాధిత జనాభా కోసం సుమారు 71,000 కిలోగ్రాముల ఆహారం, సహాయక సామగ్రిని అందించాయ‌ని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ కూడా సెప్టెంబర్ 2, 3 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లను పర్యవేక్షించడానికి సందర్శించారని తెలిపారు.

Source link