Indian Students Deported: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన పలువరు భారతీయ విద్యార్థులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో చుక్కెదురైంది. అమెరికాలోని పలు యూనివర్శిటీల్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడానికి వెళ్లిన భారతీయ విద్యార్ధులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. గురువారం అమెరికాలోని అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్‌పోర్ట్‌ల నుంచి సరైన పత్రాలు లేకపోవడం, అనుమానాస్పదంగా ఉన్న 21మందిని అమెరికా నుంచి తిరుగు ప్రయాణం కోసం విమానాలు ఎక్కించారు.