దిల్ రూబా ప్రీ రివ్యూ

Sr కల్యాణ మండపం, అనే సినిమా సక్సెస్ తో చిన్న సినిమాలకు ప్రామిసింగ్ హీరోగా మారాడు కిరణ్ అబ్బవరం, అయితే ఆపై అతను చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగాలు బెడిసికొట్టాయి. ఆ కసితో, పట్టుదలతో, రిస్క్ చేసి మరి క అనే సినిమాని తనే నిర్మాతగా చేశాడు కిరణ్ అబ్బవరం.. కాలం కలిసొచ్చిందో, తన లైఫ్ లోకి ఎంటర్ అయిన వైఫ్ లక్ ఫ్యాక్టర్ కలిసివచ్చిందో క సూపర్ సక్సెస్ అయింది.. 

తమిళ్ స్టార్ శివకార్తికేయన్ అమరన్, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ చేసిన లక్కీ భాస్కర్ సినిమాలతో పోటీ పడుతూ సెమ్ డే రిలీజ్ అయిన క  సినిమా వాటిని దీటుగా ఎదుర్కొని సూపర్ హిట్ అవడం తో హీరోగా కిరణ్ అబ్బవరం రేంజ్ అమాంతం పెరిగిపోయింది.. దానితో అతని తదుపరి చిత్రం పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.. ఈ నేపథ్యంలో క తరువాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన సినిమా దిల్ రుబా అలాగని క తరవాత చేసిన సినిమా అనుకునేరు.. కాదండోయ్ రెండేళ్ల క్రితం చేసిన సినిమా వన్ ఇయర్ గా ఒడిదుడుకులు ఎదురుకున్న సినిమా. క సినిమా సక్సెస్ తో ఈ సినిమా కష్టాలు తీరాయి, కిరణ్ అబ్బవరం అనే బ్రాండ్ తో బయటకిరాగలిగింది.. ఇది ఈ సినిమా వెనుక ఉన్న కథ.. ఇక ఈ సినిమాలో ఉన్న కథనమేమిటో, ఈ సినిమా తాలూకు రిజల్ట్ ఏంటో రివ్యూ లోకి వెళ్దాం…

దిల్ రూబా చూసే ప్రతి ఆడియన్ కి అర్జున్ రెడ్డి గుర్తొస్తుంది..100 పర్సెంట్ అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్ తోనే రాసిన కథ లా, తీసిన సినిమాలా అనిపిస్తుంది దిల్ రూబ.. యాంగర్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూ అనేది ఈ కథలో కూడా కీలకం.. చేయని తప్పుకి సారి చెప్పడం, ఎందుకని ప్రశ్నించే ఓ యువకుడి కథ దిల్ రూబ అయితే ఈ దిల్ రుబాలో అతని దిల్ ఎస్టాబ్లిష్ అవ్వడం కంటే రుబాబు ఎక్కువ గా ఎలివెట్ అయ్యింది.. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది మంచి విజువల్స్ తో, మంచి కాన్సెప్ట్ తో, సవ్యంగా సాగిన సినిమా సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పింది..

కిరణ్ అబ్బవరం తనవంతుగా  తన పాత్రకు న్యాయం చేయాలని ప్రయత్నించినా, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కి అతని హీరో ఇమేజ్ సరిపోలేదు.. పక్కింటి కుర్రాడిలా అనిపించే కిరణ్ పక్కగా తనకి సూట్ అయ్యే కేరక్టర్ సెలెక్ట్ చేసుకుంటే క వంటి రిజల్ట్స్ వస్తాయి..

ఏ కేరక్టర్ అయినా చేయగలిగే ఎనర్జీ ఉండొచ్చు, కానీ ఎప్పటికప్పుడు తన ఇమేజీకి తన స్థాయికి తగ్గ పాత్రలు చూజ్ చేసుకుంటే బెటర్ అంటున్నారు విశ్లేషకులు..

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ఫ్రస్ట్ హాఫ్ వరకు ఓకె అనిపించుకొని ఆపై వీక్ అయిపోయిన సినిమా దిల్ రుబా.. పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మాత్రం, కిరణ్ అబ్బవరం ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు..

హీరోయిన్ రుక్సార్ తిల్లన్ యూత్ ఆడియన్స్ కి కంటికి ఇంపుగా అనిపిస్తుంది..

డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ఎసెర్ట్.. 

సామ్ సీఎస్ మ్యూజిక్ కూడా ఈ మూవీ కి మెయిన్ స్ట్రెంత్.

ప్రొడ్యూసర్స్ ఎంత స్ట్రగుల్ అయిన క్వాలిటీ ఔట్ పుట్ అందించగలిగారు..

డైరెక్టర్ విశ్వకరన్ సినిమా టేక్ హాఫ్ లో తన ప్రతిభ చూపించాడు కానీ సేఫ్ ల్యాండింగ్ చేయడం లో తడ పడ్డాడు..

ఫైనల్ గా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటే క రేంజ్ సక్సెస్ అయితే అసాధ్యం అని స్పష్టంగా చెప్పొచ్చు కనీసం బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే విషయం లో కూడా డౌట్ పడొచ్చు ..

ఓ వైపు నాని నిర్మించి, ప్రేక్షకులను ఆకర్షించి కోర్టు అనే సినిమాకి ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చిన తరుణంలో సేమ్ డే రిలీజ్ అవుతున్న ఈ దిల్ రూబ నిలబడగలదా..! నిరూపించుకోగలదా.. ఈ వీకెండ్ కి మ్యాటర్ ఏంటో తేలిపోతుంది..

Source link