ముంబై నటి కాదంబరీ జత్వానీపై తప్పుడు కేసు పెట్టి వేధించినట్లు ఆరోపణలు రావడంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు చేసింది. తప్పుడు కేసులో సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ లపై పలు అభియోగాలున్నాయి. ముగ్గురు అధికారులు అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు మేరకు ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2025 సెప్టెంబర్ 25 వరకూ ఈ ముగ్గురి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.