“తెలంగాణ ప్రజల మనసులో ఉన్న ఆలోచనను విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్ లో పడొద్దు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ప్రజల్లో బదనాం చేసేది బీఆర్ఎస్ పార్టీ వాళ్లే. రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందించాలంటే అది బీజేపీతోనే సాధ్యం. దేశ అభివృద్ధి, దేశ సమగ్రత, దేశ రక్షణ మోడీ అమిత్ షా నాయకత్వంతోనే సాధ్యం. నల్లగొండ జిల్లాలో బీజేపీ బలోపేతం చేస్తాం , కాషాయ జెండా ఎగరేస్తాం. అవినీతికి పాల్పడిన మనీష్ సిసోడియా జైలు పాలు అయ్యాడు. తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకెళ్ళక తప్పదు. సీఎం కేసీఆర్ కు మినహాయింపు ఏమీ ఉండదు. కేసీసిఆర్ చేసిన అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మునుగోడలో నన్ను ఓడించడానికి వంద మంది ఎమ్మెల్యేలు వచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం ’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.