మరోవైపు తెలంగాణకు ఆంధ్రా నేతల అవసరం ఏమొచ్చిందని కొందరు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ‘తెలంగాణ వ్యతిరేకులు ఉన్న చోట ఉండలేక వెళ్లిపోయాను’ విజయశాంతి అంటూ బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, లక్ష్మణ్, బండి తదితర నేతలతో శనివారం బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ పలువురు నేతలు కిరణ్‌ను ఎందుకు పిలిచారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ పార్టీలో ఆంధ్రా నేతల పెత్తనం వద్దని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.