నాపై ఉన్న ప్రేమను పోగట్టలేరు-మనోజ్

మనోజ్ తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్, కుట్రలపై ఘాటుగా స్పందించారు. నన్ను కిందపడేయాలని ప్రయత్నిస్తున్న వాళ్లు ఉన్నా, నా అభిమానుల ప్రేమ ఎవ్వరూ తొలగించలేరు అని స్పష్టం చేశారు. సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ బడ్జెట్ ఎంతైనా ముఖ్యం కాదు సినిమా బాగుందా లేదా అనేదే అసలు విషయం అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

తాజాగా ఓ సినిమా ప్రాజెక్ట్ బడ్జెట్‌పై వచ్చిన వివాదాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన అభిమానుల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైన మనోజ్ మీ ప్రేమే నా బలం నా ఫ్యాన్స్ నా సొంతం అంటూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.

న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానని, విద్యార్థులు, సమాజం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కొందరు దీనిని నిజాయితీగా ప్రశంసిస్తుండగా మరికొందరు కుటుంబ రాజకీయాలపై పరోక్షంగా చేసిన పంచ్‌గా భావిస్తున్నారు.

జగన్నాథ్ సినిమా ప్రమోషన్ వేదికగా జరిగిన ఈ ప్రసంగం కుటుంబ వివాదాలతో పాటు కొత్త చర్చలకు దారి తీసింది. మనోజ్ వ్యాఖ్యలు మంచు ఫ్యామిలీలో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి.

Source link